అమెరికాలోని ఒహియోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వాల్మార్ట్ స్టోర్లో దొంగతనం చేస్తూ దొరికిన షేన్ న్యూమాన్ (21), విచారణ సమయంలో పోలీస్ ఆఫీసర్ తల వైపు గన్ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. అదృష్టవశాత్తూ తుపాకీ జామ్ అవ్వడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది నిందితుడిపైకి దూకి అతడిని లొంగదీశారు. బాడీకామ్ వీడియో ద్వారా బయటపడిన ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, అతని వద్ద 50 మత్తు మాత్రలు లభ్యమయ్యాయి.