సాధారణంగా పాములంటే అందరూ భయపడతారు. మనుషులే కాదు.. క్రూర మృగాలు కూడా సాధారణంగా పాముల జోలికి వెళ్లవు. పాము కాటేసిందంటే ఆ విషం ప్రాణాలను తీసేస్తుంది. అంతలా అందర్నీ భయపెట్టే పాములను ముంగిసలు భయపెడతాయి. పాము-ముంగిసల వైరం గురించి అందరికీ తెలిసిందే. పాము కనిపిస్తే చాలు ముంగిస దాడికి దిగుతుంది. ముంగిస నుంచి తప్పించుకునేందుకు పాములు పరుగులు పెడతాయి. సాధారణంగా ముంగిస-పాము మధ్య పోరాటంలే పాములే ఎక్కువసార్లు ప్రాణాలు కోల్పోతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పామును ముంగిస వెంటాడింది.