అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మానసిక రోగి.. లక్ష్మి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గుంతకల్లు- కల్లూరు రైలు మార్గంలోని ధర్మవరం గేట్ దగ్గర రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.