మత్తుకు బానిసైన వ్యక్తి బయట గంజాయి కొనలేక తన ఇంటి పెరట్లోనే మొక్కలు సాగు చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా పల్కపల్లికి చెందిన మధు అచ్చంపేటలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా గంజాయికి బానిసైన మధు.. అధిక ధరలకు గంజాయి కొనుగోలు చేయలేక.. అమ్రాబాద్ మండలం మన్ననూర్, హైదరాబాద్‌లో గంజాయి విత్తనాలను సేకరించాడు. గత రెండేళ్ల నుంచి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్నాడు. ఈ గంజాయిని తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. మధు ఇంటిని పరిశీలించి అదుపులోకి తీసుకున్నారు.