అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏడీసీసీ బ్యాంకు సొంత భవన కల నెరవేరబోతోంది. కాలేజీ రోడ్డులో నిర్మించనున్న నూతన భవనానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేసి రైతులకు, ఖాతాదారులకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు సొంత భవనం లేక సిబ్బంది, రైతులు పడుతున్న ఇబ్బందులు ఇకపై తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు.