మహారాష్ట్రలోని అమరావతి(D)లో పెళ్లికొడుకుపై కత్తిపోట్లు కలకలం రేపాయి. పెళ్లికుమారుడు సుజల్ రామ్ సముద్రపై జితేంద్ర అనే వ్యక్తి కత్తితో 3సార్లు దాడి చేశాడు. తర్వాత బైక్పై పరారయ్యాడు. ఫొటో గ్రాఫర్ డ్రోన్ కెమెరాతో నిందితుడిని 2 కి.మీ. వెంబడించాడు. ఆ ఫుటేజీతోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. DJ డాన్స్ విషయంలో జరిగిన గొడవే దాడికి కారణమని తెలుస్తోంది. పెళ్లికొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.