సీఎం సొంత గ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. 2,214 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం సర్పంచ్ పదవి ఈసారి ఎస్సీ జనరల్ గా రిజర్వ్ చేయబడింది. గ్రామంలో పది వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో జరగాల్సిన ఎన్నికలు ఏకగ్రీవంగానే చేయాలని గ్రామ పెద్దలు, గ్రామ యువత అంతా కలిసి నిర్ణయించడం జరిగింది. దాంతో గ్రామానికి చెందిన వెంకటయ్య అలియాస్ మోహన్ అనే నాయకుడిని సర్పంచ్ గా ఎంపిక చేశారు. అదేవిధంగా పదిమంది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగానే నిర్ణయించి.. వారు మాత్రమే నామినేషన్లు వేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.