సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మురడి గ్రామంలో 70 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన మురిడి- తమ్మేపల్లి రహదారిని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి ప్రారంభించారు.