యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. మండల పరిషత్ కార్యాలయం, వెలుగు కార్యాలయం, పాల శీతలీకరణ కేంద్రం, పాత తాసిల్దార్ కార్యాలయాలు నీట మునిగాయి. అధికారులు ముందు జాగ్రత్తగా ఫైల్స్, కంప్యూటర్లు వేరే ప్రాంతానికి తరలించారు. ఆర్డీవో కార్యాలయంలోకి సైతం నెమ్మదిగా నీళ్లు చేరుతున్నాయి.