పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైఎన్ కళాశాల మైదానంలో డిపార్ట్మెంటల్ 'గోదావరి క్రీడా ఉత్సవాలు' ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా ప్రారంభించి, ఉద్యోగులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడి అందరిలో ఉత్సాహం నింపారు. నరసాపురం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతరం విధులతో బిజీగా ఉండే ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే ఈ క్రీడల ప్రధాన ఉద్దేశమని తెలిపారు జాయింట్ కలెక్టర్.