పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరి తీరం పోలీ వర్గం దీప కాంతులతో వెలిగిపోయింది. తెల్లవారుజాము నుంచి నరసాపురం వశిష్ట గోదావరిలో దీపాలు విడిచి పెట్టేందుకు భక్తులు పోటెత్తారు. స్థానికులతో పాటు జిల్లా నలు మూలల నుంచి మహిళలు తరలిరావడంతో పట్టణంలోని వలందర్, అమరేశ్వర రేవులు కిటకిటలాడాయి. కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే ఈ పాడ్యమి అమావాస్యను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. కార్తీక మాసం నెలరోజులు ధూప దీప నైవేద్యాలు, దానాలు పూజలు చెయ్యకపోయినా కనీసం పాడ్యమి అమావాస్య రోజున నదిలో స్నానమాచరించి దీపాలు విడిచిపెడితే కార్తీక మాసంలో వచ్చే పుణ్యం ఫలం ఈరోజు చేస్తే లభిస్తుందన్నదని భక్తుల నమ్మకం...