ప్రకాశం జిల్లా గిద్దలూరు తాశీల్దార్ కార్యాలయాన్ని ఓ ఆకతాయి ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టాడు. 20 వేలకే గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయం అమ్ముతానంటూ కార్యాలయం ఫోటోలతో సహా పోస్ట్ చేశాడు. ఓఎల్ఎక్స్ లో తహశీల్దార్ కార్యాలయం చూసి స్థానికులు విస్తుపోయారు. గత నెల 23న తహశీల్దార్ కార్యాలయం భవనం, దాని ఫోటో, చిరునామాతో సహా “అమ్మకానికి ఉంది” అని జోడించి అప్లోడ్ చేశారు. దీని గురించి తెలుసుకున్న తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.