గ్యాస్ సిలిండర్ లీకై భారీ పేలుడు సంభవించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది. అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కాగానే ఓ మహిళ సిలిండర్ను బయటకు తెచ్చేందుకు విఫలయత్నం చేసింది. గ్యాస్ పూర్తిగా లీకైన తర్వాత ఆమెతోపాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు. కిచెన్ నుంచి క్షణాల్లో మంట రావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరూ అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియాల్సి ఉంది.