టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. గంభీర్ దగ్గరుండి శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు. ఆ సమయంలో పిచ్ క్యూరేటర్ అయిన లీ ఫోర్టిస్ అక్కడకు చేరుకున్నాడు.