పల్నాడు జిల్లా నరసరావుపేట ఎన్టీఆర్ కాలనీ సిసి రోడ్డుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్,ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమంపైనే కాకుండా.. అభివృద్ధిలో కూడా దూసుకుపోతుందని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. త్వరలోనే ఎన్టీఆర్ కాలనీలో స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రైనేజీ సమస్య లేకుండా సైడ్ కాలువలను పూర్తి చేస్తామని.. పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు.