కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మండల విద్యా శాఖ మాజీ అధికారి.. సైబర్ వలలో చిక్కుకున్నారు. మాజీ ఎంఈఓ బొజ్జా రమణశ్రీను లక్ష్యంగా చేసుకున్న నేరగాళ్లు, మీపై కేసు ఉందని, తక్షణం జరిమానా చెల్లించాలి అని భయపెట్టి, వీడియో కాల్స్ చేస్తూ అధికారుల పేర్లతో నమ్మబలికి మొత్తం 34 లక్షలు దోచేశారు. తాను మోసానికి గురైనట్టు గ్రహించిన రమణశ్రీ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.