జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామంలో ఉపసర్పంచ్ పదవి కోసం వార్డు మెంబర్ను ఎత్తుకెళ్లారు. ఊరిలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మొదటి వార్డు మెంబర్ను తీసుకెళ్లారు. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సంగి పర్శరాములు వద్దని బ్రతిమిలాడినా, వినకుండా ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపొందగా.. మొత్తం 8 వార్డుల్లో 5 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఉపసర్పంచ్ పదవి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.