రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నర్సంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నర్సంపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. దీంతో గ్రామానికి చెందిన సోనా హనుమాన్ నాయక్ ఈ నెల 17న నామినేషన్ వేసేందుకు వెళ్లగా.. ఓటర్ లిస్టులో పేరు లేదంటూ ఆఫీసర్ నామినేషన్ పత్రాలు తీసుకోలేదు. దీంతో అదే రోజు హైకోర్టును ఆశ్రయించగా సోనా హనుమాన్ నాయక్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. తిరిగి నామినేషన్ వేసేందుకు వెళ్లిన అదే పరిస్థితి ఎదురవడంతో ఐదవ తేదీన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపి కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నర్సంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలను నిలిపివేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.