ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఐదుగురు వ్యక్తులు బైకుపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ పట్టుబడ్డారు. నలుగురు యువకులు బైకుపై కూర్చోగా, ఒక బాలుడిని పక్కకు వేలాడదీసి ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. హెల్మెట్, ఇన్సూరెన్స్ లేకపోవడం, ప్రమాదకర ప్రయాణం వంటి ఉల్లంఘనల కింద రూ. 31 వేల జరిమానా విధించారు. న్యూఇయర్ వేళ ఇలాంటి అల్లరి మూకల పట్ల కఠినంగా ఉండాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.