ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతుండటంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను విడిచిపెట్టి అర్మేనియా సరిహద్దుకు చేరుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన విమానం బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనుంది. ఇందులో 90 మంది కశ్మీర్‌కు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ విమానం ఈ రోజు రాత్రి 10.15 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది.