ఇండోనేసియాలో వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ గర్భిణీ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. ఇప్పటివరకు 280 మందిని రక్షించినట్లు సమాచారం.