హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ భవన నిర్మాణానికి సంబంధించి, అక్కడ నిల్వ ఉంచిన చెక్క సామాన్లకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చి పూర్తిగా ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.