తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మహిళలతో సహా 11 మంది మృతి చెందిన ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటుచేసుకుంది. శివగంగ జిల్లా తిరుపత్తూర్ సమీపంలోని కారైక్కుడి నుంచి దిండుక్కల్ వెళ్తున్న బస్సు, తిరుప్పూర్ నుంచి కారైక్కుడి వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి.