అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.