నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన చేపట్టారు. ఆన్లైన్ ద్వారా 30 క్వింటాళ్ల విక్రయానికి ఒక రైతు స్లాట్ బుక్ చేసుకోగా.. అక్కడికి వచ్చిన తర్వాత తమకు కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే కనిపిస్తోందని.. ఆన్లైన్ ప్రకారం మూడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు తెలిపారు. ఇలా రైతులందరికీ ఆన్లైన్లో తప్పు చూపిస్తోందని.. తాము తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలంటూ ఆందోళనకు దిగారు. తాము స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలతో కొనుగోలు కేంద్రం దగ్గర పత్తి లోడు వచ్చిన ట్రాక్టర్స్ భారీగా నిలిచిపోయాయి.