విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, హెచ్ఐవి బాధిత పిల్లలతో కలిసి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. వారితో కాసేపు సరదాగా మాట్లాడి, వారి ఇష్టాలు, భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వ్యాధిగ్రస్తులలోని వైరల్ లోడ్‌ను తగ్గించడానికి ఆధునిక ఔషధాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడితే వారి జీవన ప్రమాణం పెరుగుతుందని, తద్వారా రాష్ట్రంలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య తగ్గుతుందని ఆయన చెప్పారు.