సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొడుకుపైనే ప్రమాదకర ప్రయోగం చేసిందో తల్లి. రష్యాలోని సరటోవ్ అన్నా సపరీనా (36) పేరెంటింగ్ బ్లాగ్ నడుపుతోంది. ఇటీవల తన కొడుకును ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి, దానిలో నుంచి గాలిని బయటికి పంపింది. దీంతో కొన్ని సెకన్లకే పిల్లాడు విలవిల్లాడాడు. అందులో ఉండలేక 'అమ్మా' అంటూ కేకలు పెట్టాడు. వ్యూస్ కోసం ఇలా చేస్తారా, అసలు ఈమె తల్లేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.