శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలంలోని దనియానిచెరువు సమీపంలో ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను గ్రామస్థులు గుర్తించి, ఆలయాన్ని చుట్టుముట్టి ముగ్గురిని పట్టుకున్నారు. పట్టుబడిన వారి వద్ద పూజా సామగ్రి, ధాన్యాలు లభించాయి. విచారణలో వీరు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం, మదనపల్లి ప్రాంతాలకు చెందిన వారిగా తెలిసింది.