మేడారం జాతరకు సర్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న వనదేవతల ఉత్సవాలకు పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారంలోని డోలు వాయిద్యాల మధ్య సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజు గద్దెను పెనక వంశీయులు.. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజుల ఆలయ పూజారులతో కలిసి కదిలించారు. డిసెంబర్ మొదటి వారంలో పగిడిద్దరాజును ప్రతిష్టాపన చేస్తామని పూజారులు తెలిపారు.