సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత మనసుకు హత్తుకునే ఎన్నో వీడియోలు చూసే అవకాశం దొరుకుతోంది. చిన్న పిల్లలు, జంతువుల అల్లరికి సంబంధించిన వీడియోలు చూస్తే టైమ్ ఇట్టే గడిచిపోతుంది. తాజాగా ఓ పిల్ల ఏనుగు చేసిన పని నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ భార్యాభర్తల జంట మైదానంలో కూర్చుని ఉంది. వారి వెనకాలికి ఓ పిల్ల ఏనుగు వచ్చింది. వచ్చీ రాగానే భర్త వీపు పైకి ఎక్కింది.