హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ మచ్చ బొల్లారంలో ఎర్టిగా కారు బీభత్సం సృష్టించింది. సెలెక్ట్ థియేటర్ దగ్గర దుకాణాలు, వ్యాపార సముదాయాలపై కారు దూసుకెళ్లింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మచ్చబొల్లారం నుంచి సెలెక్ట్ థియేటర్ వైపు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. కారు దూసుకొచ్చిన సమయంలో దుకాణాల దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.