సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమవరం గ్రామానికి చెందిన కొమ్మరాజు సుస్మిత శనివారం స్నేహితులతో.. మూసీ నదిలో గణపతిని నిమజ్జనం చేస్తూ గల్లంతైంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆదివారం బూర్గుల తండా సమీపంలో సుస్మిత మృతదేహాన్ని గుర్తించారు. వరద ప్రవాహం కారణంగా మృతదేహాన్ని బయటకు తీయడం కష్టంగా మారింది. దీంతో నేరేడుచర్ల ఎస్సై రవీందర్ స్వయంగా నదిలో దూకి.. ఈదుకుంటూ వెళ్లి.. మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.