IPLలో అరంగేట్ర మ్యాచులోనే అలరించిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాక ఎమోషనల్ అయ్యారు. లక్నో బౌలర్ మార్క్రమ్ బౌలింగ్లో స్టంపౌటై డగౌట్ కు వెళ్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టిన ఈ ప్లేయర్ 20 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 34 పరుగులు చేశారు.