కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో విషాదం నెలకొంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా పెద్దఎత్తున టపాసులు పేల్చారు. ఆ శబ్దాలకు భయపడిన పీతాంబరం, గోకుల్ అనే 2 ఏనుగులు ఒక్కసారిగా పరిగెత్తడంతో వాటి కింద పడి ముగ్గురు చనిపోగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన తర్వాత వాటిని మచ్చిక చేసుకోవడానికి 2 గంటలు పట్టిందని స్థానికులు చెప్పారు