థాయ్లాండ్ లో ఓ వింత దృశ్యం చోటుచేసుకుంది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు నేరుగా షాపింగ్ మాల్లోకి వెళ్లింది. అయితే ఇది మనకు ఆశ్చర్యం కలిగించినా, స్థానికులకు మాత్రం సాధారణమే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం జనావాసాలకు వస్తుంటాయి.