కరీంనగర్లో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. నిన్నటి వరకు 6 ఉన్న గుడ్డు, హోల్సేల్లో ఇప్పుడు 7కు చేరింది. చలి కారణంగా ఉత్పత్తి తగ్గడం, కార్తీక మాసం ముగియడం ధరల పెరుగుదలకు కారణమంటున్నారు వ్యాపారులు. గ్రామీణ ప్రాంతాలలో ఒక్కో గుడ్డు 7.50 నుంచి 8 వరకు అమ్ముడవుతోంది.