విశాఖపట్నంలో భూకంపం అలజడి రేపింది. నగరంతో పాటు పరిసరాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటల సమయంలో భూమి కంపించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైంది. భీమిలి ప్రాంతంలో శబ్దాలు కూడా వచ్చినట్టు చెబుతున్నారు. తొట్లకొండ పరిసరాలు భూకంప కేంద్ర స్థానంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలోనూ కొద్దిసేపు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.