విశాఖపట్నం పర్యాటకులకు శుభవార్త. ఆర్కే బీచ్ నుంచి నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులను ఇప్పుడు సింహాచలం కొండ దిగువ బస్టాండు వరకు పొడిగించారు. అధికారులు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. పర్యాటకులను ఆకర్షించేందుకు టికెట్ ధరలను సగానికి తగ్గించారు. ఇప్పుడు పెద్దలకు 263, పిల్లలకు 105 చెల్లిస్తే 24 గంటల్లో ఆర్కే బీచ్, సింహాచలం, కైలాసగిరి, రుషికొండ వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలకు ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. బస్సులో పైన కూర్చుని విశాఖ అందాలను చూడటం చాలా ఆహ్లాదకరంగా ఉందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.