సీసీఐ కేంద్రాలకు పత్తి దిగుబడులతో వస్తున్న రైతులను నిబంధనల పేరుతో ఇబ్బందికి గురి చేసి వెనక్కి పంపొద్దని జిల్లా కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. ఆదోనిలోని NDBL, విఘ్నే శ్వర జిన్నింగ్ మిల్లులోని సీసీ పత్తి కొనుగోలు కేంద్రాలను కలెక్టరు పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. సాంకేతిక సమస్యలను అధిగమించేలా చొరవ తీసుకుంటామన్నారు. సీసీఐ కొనుగోలు చేయని పత్తిని రైతుల నుండి మిల్లర్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన వారికి కొంత సేపు ఆహారం వడ్డించారు..