గత ప్రభుత్వంలో పాలకులు సర్వజనాసుపత్రిని ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ ఆసుపత్రికి యాభై వీల్ చైర్లను విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా వీటిని ఆసుపత్రికి అందించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.