ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను శరీరంలో వదిలేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నరసరావుపేట బాలయ్యనగర్‌కు చెందిన రమాదేవి ఇటీవల ఆసుపత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్ నారాయణ స్వామి, సిబ్బంది శస్త్ర చికిత్స చేశారు. తర్వాత నొప్పి తీవ్రంగా రావడంతో సిబ్బంది దృష్టికి ఆమె తీసుకెళ్లారు. నొప్పి సహజమని వారు బాధితురాలికి నచ్చజెప్పారు. ఈక్రమంలో శుక్రవారం ఆమెకు స్కానింగ్ చేయగా.. కడుపులో సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాధితమహిళ బంధువులు కంగుతిన్నారు.ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.