ఉత్తరప్రదేశ్లోని షామ్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సిద్ధిఖీ, తనకు కాబోయే భార్యతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. ఆసుపత్రిలో ఈ చర్యపై విమర్శలు రావడంతో మెడికల్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్ వివరణ కోరారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో, డాక్టర్ సిద్ధిఖీని అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించారు. కేటాయించిన వసతి గదిని కూడా ఖాళీ చేయించారు.