భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాలకు చెందిన ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. ములకలపల్లిలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.