బాపట్ల ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అండగా నిలిచారు. హాస్టల్లో మంచాలు లేక విద్యార్థులు నేలపై పడుకుంటూ చలికి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆయన...వేగేశన ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో 90 ఇనుప మంచాలను అందజేశారు. మాటలు రాని, చెవులు వినిపించని ఈ పిల్లలకు సేవ చేయడం తన మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు ఎమ్మెల్యే. గతంలో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి సూచన మేరకు ఈ సాయం చేసినట్లు ఆయన తెలిపారు.