33 రోజుల్లో 50 కోట్ల మందికిపైగా భక్తుల పుణ్యస్నానాలు. ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళాకు భక్తులు అంచనాలకు మించి పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి నేటి వరకు 50 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా కొనసాగనుండగా ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉంది.