జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో దట్టమైన పొగమంచు వ్యాపించింది. రోడ్లపై మంచు దుప్పటి కప్పినట్లు ఉండడంతో దాదాపు పది మీటర్ల దూరం వరకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా.. ఊపిరితిత్తులు, ఆస్తమా సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పొగమంచు ఉండడతో చాలా మంది యువకులు సెల్ఫీలు తీసుకుని రోడ్లపై సందడి చేశారు.