భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో పరిశోధనలు జరుపుతుండగా ఈ స్పేస్ స్టేషన్ సోమవారం అర్ధరాత్రి దిల్లీ గగనతలంలో మెరిసింది. ఈ అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ప్రజలు శుభాంశుకు ‘హాయ్’ అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. భూమికి 400 కిమీ ఎత్తులో పరిభ్రమిస్తూ రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టే ఐఎస్ఎస్, రాత్రివేళల్లో సూర్యకాంతి ప్రతిబింబంతో కనిపిస్తుందని నాసా తెలిపింది.