తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలోని 27 ఏళ్ల అజిత్ కుమార్ అనే ఆలయ సెక్యూరిటీ గార్డు కస్టడీలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జూన్ 27న ఒక దొంగతనం కేసులో విచారణ కోసం అజిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రోజు అతను మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం అజిత్ కుమార్ శరీరంపై గాయాలున్నట్లు తేలింది. ముఖం, చెవులు, మోచేతులు, పక్కటెముకలపై తీవ్ర గాయాలు, రెండు చెవులపై రక్తపు మరకలు గాయాలు ఉన్నాయి. పోలీసుల హింస కారణంగా అతను చనిపోయాడని అజిత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మొదట అతను పారిపోవడానికి ప్రయత్నించి జారి పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. కానీ అజిత్ శరీరంపై గాయాలు చూస్తే అతడిని కొట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.