నకిలీ ధ్రువపత్రాలతో అల్వాల్ తహసిల్దార్‌ను సైనిక్‌పురికి చెందిన దాసరి లక్ష్మి అనే మహిళ బురిడీ కొట్టించింది. మృతి చెందిన వ్యక్తికి తానే భార్యనని నమ్మిస్తూ నకిలీ కుటుంబ ధ్రువపత్రాన్ని సృష్టించింది. వృద్ధులైన తన అత్తమామలు చనిపోయారని మోసం చేసి వారికి సంబంధించిన ఆస్తులను ఇతరులకు విక్రయించింది. ఇదే విషయమై వృద్ధులు అల్వాల్ తహసిల్దారు ను ఆశ్రయించగా లక్ష్మీ చేసిన బాగోతం అంతా బయటపడింది. ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్న తహసిల్దార్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.