బ్రెజిల్: బ్రెజిల్లో జర్నలిస్ట్‌కు భయానక అనుభవం ఎదురైంది. ఈశాన్య బ్రెజిల్‌లోని మియరిం నది ఒడ్డున ఈ భయానక ఘటన ఒక్కసారిగా అందరినీ వణికించింది. 13 ఏళ్ల స్కూల్ విద్యార్థిని అదృశ్యమైన కేసు గురించి మిరియం నదిలోకి దిగి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి కాలు కిందకు ఏదొ వచ్చినట్టు ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. కానీ, ఆ సమయంలో తాను అడుగు వేసింది మిస్సింగ్ అయిన బాలిక మృతదేహంపైనే అని అప్పుడు అతడికి తెలియదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.